![]() |
![]() |
.webp)
జోర్దార్ సుజాత.. తన మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ ని మరింత పెంచుకుంది. తాజాగా విడుదలైన 'సేవ్ ది టైగర్స్' లో నటించి తనలోని మరొక కోణాన్ని తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
జోర్దార్ సుజాత తన డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ రీత్యా హైదరాబాద్ కి వచ్చింది. ఆమె మొదట ఆన్‌లైన్ మార్కెటింగ్ జాబ్‌లో చేరింది. ఈ క్రమంలోనే తనకి ఓ ప్రోగ్రామ్ లో తెలంగాణలో మాట్లాడే అవకాశం ఉందని అనడంతో తనకు అదృష్టం కలిసొచ్చింది. అలా తీన్మార్ వార్తలు చెప్తూ సుజాతగా పరిచయమైంది. ఆ తరువాత జోర్దార్ వార్తలతో 'జోర్దార్ సుజాత' గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ఫేమ్ పొందిన తర్వాత బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. ఆమె బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చిన తర్వాత మాటీవీలో 'ఆహారం-ఆరోగ్యం' కార్యక్రమం చేస్తుంది. సుజాత తన యూట్యూబ్ ఛానల్ సూపర్ సుజాత ద్వారా ప్రజలకు మరింత చేరువైంది. అలాగే సుజాత జబర్దస్త్ కామెడీ షోలో రాకింగ్ రాకేష్ టీమ్‌లో నటిస్తుంది. అంతేకాదు ఆమె, రాకింగ్ రాకేష్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి తమ అప్డేట్స్ ని ఇస్తుంటారు.
తాజాగా సుజాత తన అత్తమ్మతో కలిసి ఒక వ్లాగ్ చేసింది. సుజాత నటించిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ గురించి వాళ్ళ అత్తమ్మ సుజాతని అడిగి తెలుసుకుంది. ఆ సిరీస్ నాకు చాలా గుర్తింపు ఇచ్చింది. నేను పెద్ద ఫ్యాన్. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని అంటారు కదా.. ఈ వెబ్ సిరీస్ చూసి మా ఇంట్లో మా అత్తమ్మ పొగిడారు. చుట్టు పక్కల వాళ్ళు వచ్చి బాగా చేసావని పొగుడుతుంటే అంతకన్నా సంతోషం ఉండదని సుజాత చెప్పుకొచ్చింది. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 లో ప్రతి ఒక్కరు ఇచ్చి పడేసారు. సిరీస్ ఎండ్ లో ఉంది కమింగ్ సూన్ అంటూ సుజాత చెప్పుకొచ్చింది.
![]() |
![]() |